Tharun: మెగా ఇంటికి అల్లుడు కాబోతున్న తరుణ్.. వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్… నిజమెంత?

0
221

Tharun: సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఒకానొక సమయంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి సినిమాలలోకి రావాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే తరుణ్ మాత్రం తన సినీ ఇండస్ట్రీ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక వయసులో తరుణ్ కన్నా ఎంతో చిన్న హీరోలు పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. అయితే ఇప్పటికి తరుణ్ ఇంకా సింగిల్గానే ఉన్నారు కానీ ఈయన త్వరలోనే మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారని ఓ వార్త సంచలనగా మారింది. దీంతో అభిమానులు ఏ ఇంటికి అల్లుడు కాబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే మెగా ఫ్యామిలీలో శ్రీజ నిహారిక ఇద్దరు విడాకులు తీసుకుని మెగా ఫ్యామిలీలోనే ఉన్న విషయం మనకు తెలిసిందే. దీంతో వీరిద్దరిలో తరుణ్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ విధంగా తరుణ్ మెగా ఫ్యామిలీకి అల్లుడు కాబోతున్నారన్న వార్తలు రావడానికి కారణం తన తల్లి రోజా రమణి చేసిన కామెంట్స్ కారణమని తెలుస్తుంది.

Tharun: రోజా రమణి కామెంట్స్ వైరల్…


గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె త్వరలోనే తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నారు అది కూడా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న బడా ఇంటికి అల్లుడు కాబోతున్నారు అంటూ తెలిపారు. దీంతో అక్కినేని ఫ్యామిలీలో ఆడపిల్లలు లేరు నందమూరి ఫ్యామిలీలో కూడా పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు లేరు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ కూతురు ఉన్నప్పటికీ తరుణ్ కన్నా వయసులో చాలా చిన్నది. ఇక మిగిలినది మెగా ఫ్యామిలీ మాత్రమే.బహుజ మెగా ఫ్యామిలీకి ఈయన అల్లుడు కాబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.