Actress Sudha: ఎన్నో తెలుగు సినిమాలలో తల్లిగా, వదినగా, పిన్నిగా అన్ని పాత్రలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సుధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కెరియర్ మొదట్లో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు.కానీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నో మంచి సినిమాలో నటించిన మీకు నంది అవార్డు రాకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురవగా అందుకు ఆమె సమాధానం చెబుతూ పదిమంది కూర్చొని ఇచ్చే అవార్డు గొప్పది కాదు… లక్షల మంది నా నటనను చూసి చప్పట్లు కొట్టి నన్ను అభినందించడమే అసలైన బహుమతి అంటూ చెప్పుకొచ్చారు.

అలా నేను నటించిన ప్రతి సినిమా కూడా ఒక అవార్డును అందుకునే పాత్రలలో నటించాను. ఆమె సినిమా అయితే నేమి, నువ్వు నాకు నచ్చావ్, పోకిరి, దూకుడు,మన్మధుడు వంటి ప్రతి ఒక్క సినిమా కూడా ఎంతో అద్భుతమైన సినిమా అని తెలిపారు.ఇక మన్మధుడు సినిమా గురించి చెప్పాలంటే మొదటి హాఫ్ మొత్తం నాగార్జున నా పైన సెటైర్లు వేస్తూ ఉండే పాత్రలో నటించారు మిగిలిన సగం తనకు నిజం చెప్పలేక మదనపడుతూ నటించాల్సిన పాత్ర నాది అంటూ చెప్పారు.
నాలుగు ఇండ్లు కట్టించుకోవాల్సి వచ్చేది…
ఇలా నేను నటించిన ప్రతి సినిమా కూడా అవార్డు అందుకొనే సినిమా.. అలా అవార్డులు కనుక వచ్చి ఉంటే అవార్డుల కోసం నేను నాలుగు ఇండ్లు కట్టించుకోవాల్సి వచ్చేదని తెలిపారు. ఇక డైరెక్టర్ బాలచంద్ర గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో గొప్ప డైరెక్టర్ అని అతను ఒక ఆర్టిస్ట్ ని చూడగానే ఇండస్ట్రీలో ఎంతవరకు ఉండగలరని చెప్పగలరని తెలిపారు.కెరియర్ మొదట్లో నేను చెప్పిన ఈ మూడు పాత్రలు చేయగలిగితే నువ్వు చచ్చేవరకు ఇండస్ట్రీలో ఉంటావు. లేదంటే ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పారు. ఆయన ఒక మనిషిని చూసి ఎలా చేయగలరో ఇట్టే చెప్పేస్తారు కనుక నీ మొహం గ్లామర్ పని మనిషి కూడా పనికి రాదని అన్నారు అంటూ సుధ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.































