నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ యువ నటి అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ, తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రంగస్థలం సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని తాను వదులుకున్నాననే తప్పుడు ప్రచారం జరిగిందని వెల్లడించారు. ఈ ప్రచారం కారణంగా ఆరు నెలల పాటు తనకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదని ఆమె తెలిపారు.
“ఆరు నెలల పాటు నేను పూర్తిగా ఖాళీగా ఉన్నాను. రంగస్థలం సినిమాలో హీరోయిన్‌గా నటించమని దర్శకుడు సుకుమార్ నన్ను సంప్రదించారు. నేను కూడా ఆ సినిమాలో నటించడానికి సుముఖంగా ఉన్నాను. కానీ, తర్వాత వారు సమంతను హీరోయిన్‌గా తీసుకున్నారు. నేను ఆ సినిమాను తిరస్కరించినట్లు తప్పుడు వార్తలు వచ్చాయి. ఈ తప్పుడు ప్రచారం వల్ల ఆరు నెలలు నేను ఇంటికే పరిమితమైనాను,” అని అనుపమ విచారం వ్యక్తం చేశారు.
అనుపమ పంచుకున్న ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, రంగస్థలం సినిమాలో సమంత నటించి, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, ఆమె ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది.






























