Ntr: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ నటన పరంగా ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం గతంలో తన తల్లికి తనకు జరిగిన అవమానమే కారణమని తెలుస్తుంది. తమకు జరిగిన అవమానంతోనే ఈయన ఎలాగైనా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందాలన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి రావడం వెనుక పెద్ద అవమానం జరిగిందని తెలుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ఇష్టం లేకుండా హరికృష్ణ శాలినిని పెళ్లి చేసుకున్నారు.
ఇక ఎన్టీఆర్ కుటుంబంలో తన చిన్న కుమారుడు వివాహం జరుగుతున్నటువంటి తరుణంలో హరికృష్ణ ఎన్టీఆర్ శాలిని కూడా అవివాహానికి తీసుకువచ్చారట దీంతో వీరిద్దరిని పెళ్లి మండపంలో చూసినటువంటి సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణని పిలిచి వారి ముందే ఈ పెళ్లికి ఎంతో మంది ప్రముఖులు వస్తున్నారు ఇలాంటప్పుడు వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని అరిచారట దీంతో హరికృష్ణ తిరిగి వారిని వెనక్కి పంపించారు.
సీనియర్ ఎన్టీఆర్ అవమానించార…
ఇలా తమకు అందరి ముందు అవమానం కావడంతో ఎలాగైనా నా కొడుకు మంచి స్థాయిలో ఉండాలని అప్పటినుంచి శాలిని తన కుమారుడికి నటనలోనూ డాన్స్ లోనూ శిక్షణ ఇప్పిస్తూ నేడు అందరూ నందమూరి వారసులు అని చెప్పుకునే స్థాయికి తీసుకువచ్చారని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ స్టార్ హీరో అవడం వెనుక ఈ అవమానం దాగి ఉందని తెలుస్తుంది.
































