Jabardasth Comedian Apparao: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ అప్పారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ లలో అప్పారావు కూడా ఒకరు. అప్పారావు జబర్దస్త్ షో లో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ వచ్చాడు. రోజానీ వదిన అని, నాగబాబుని బావ అని పిలుస్తూ ప్రేక్షకులను మరింత నవ్వించాడు.

ఇదిలా ఉంటే ఎప్పుడూ తన కామెడీతో ప్రేక్షకులు నవ్వించే అప్పారావు ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో అంతగా కనిపించడం లేదు. జబర్దస్త్ తో పాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో అప్పారావు కనిపిస్తున్నాడు. కానీ జబర్దస్త్ లో మాత్రం కనిపించడం లేదు. అయితే ఇదే విషయంపై స్పందించిన అప్పారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ.. జబర్దస్త్ షోలో గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నానని, ఆ ఎనిమిది సంవత్సరాలలో ఎప్పుడూ కూడా షూటింగ్ కు ఆలస్యంగా రావడం కానీ లేదంటే, షూటింగ్ కి డుమ్మా కొట్టడం కానీ చేయలేదని తెలిపారు. కానీ నన్ను మాత్రం కొందరు వ్యక్తుల చెప్పుడు మాటల కారణంగా దూరంపెట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో తన వయసును దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ కొంతకాలం పాటు వెయిట్ చేయమని చెప్పారని, కానీ ఆ తరువాత వాళ్లు నన్ను పిలవలేదని తెలిపాడు అప్పారావు. అంతేకాకుండా చెప్పుడు మాటలు వినీ తననీ హోల్డ్ లో పెట్టారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు అప్పారావు.
ఎంతో అవమానించారు…
అంతేకాకుండా జబర్దస్త్ లో తాను ఉన్న సమయంలో స్కిట్ లో ప్రాధాన్యత లేని పాత్రలు కూడా చేశానని, ఒకప్పుడు టీం లీడర్ గా పనిచేసిన తనను ఆ తర్వాత కాలంలో కనీసం ఒక కంటెస్టెంట్ కు ఇచ్చిన గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలా తనని పరోక్షంగా అవమానించారని అప్పారావు బాధపడ్డాడు. అందువల్లే జబర్దస్త్ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని తెలిపాడు. అంతేకాకుండా జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కనీసం ఎందుకు వెళ్తున్నారని ఒక్క మాట కూడా అడగలేదని తీవ్ర ఆవేదన చెందారు. అయితే ప్రస్తుతం మరొక కామెడీ షోలో చేస్తున్నాను. అందులో డబుల్ పేమెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం నా పరిస్థితి కూడా బాగానే ఉందని చెప్పుకొచ్చాడు అప్పారావు.



























