Produce Harassment: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు మాయమాటలకు మోసపోయి జీవితాలను నాశనం చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది క్యాస్టింగ్ కౌచ్ లకు గురికాగా మరికొంతమంది అవకాశాల కోసం నిర్మాతలతో కమిట్మెంట్ లకు ఒప్పుకుంటారు.

సినీ ఇండస్ట్రీలో నిర్మాత అని నటిని పరిచయం చేసుకుని తనని పెళ్లి చేసుకొని చివరికి తనతోనే వ్యభిచారం చేయమంటూ తనని బలవంతం చేస్తున్నారని సహాయ నటి పరమేశ్వరి అలియాస్ భైరవి శుక్రవారం చెన్నైలో డీజీపీకి ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది.

భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బతుకుతున్న తనకు వేలూరుకు చెందిన రాజా దేసింగ్ అలియాస్ సుబ్రమణి నిర్మాతగా పరిచయం చేసుకుని, తనని కూడా నిర్మాతలు చేస్తానంటూ కల్లబొల్లి మాటలు చెప్పి తనను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత తనని వ్యభిచారి గా మార్చే ప్రయత్నం చేశారని, తనపై ఇలాంటి ఒత్తిడి అధికంగా తీసుకువస్తున్నారని ఈమె ఫిర్యాదులో పేర్కొంది.
కఠినంగా శిక్షించాలి..
తాను చెప్పే విధంగా నడుచుకోకపోతే తనని చంపేస్తానని బెదిరిస్తున్నట్లు నటి పరమేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇక తన పిల్లల చేత కూడా బలవంతంగా ఇలాంటి వ్యభిచారం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈమె తన బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజా దేసింగ్ పలువురు అమ్మాయిలను మోసం చేయడమే కాకుండా ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడి పోక్సో చట్టం కింద అరెస్టు కూడా అయ్యాడనీ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తనకు అతని నుంచి రక్షణ కల్పించాలని నటి పరమేశ్వరి ఈ ఫిర్యాదులో పేర్కొంది.
































