Vishwaksen: పాగల్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమా ఈ నెల 6వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో విశ్వక్ సేన్ నడి రోడ్డుపై ఒక ఫ్రాంక్ వీడియో చేశారంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి పనులు చేయటం ఏంటి పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి నాన్సెన్స్ ఏంటి అని పెద్ద ఎత్తున నెటిజన్లు వీరి వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఈ ఫ్రాంక్ వీడియో పై ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ 9 ఓ డిబేట్ నిర్వహించింది. ఇలా ఈ సంఘటన గురించి టిబెట్ జరుగుతూ ఉండగా మధ్యలో హీరో విశ్వక్ సేన్ ఈ డిబేట్ కి హాజరయి యాంకర్ దేవి నాగవల్లితో డిబేట్ లో పాల్గొన్నారు.
గెటవుట్ అన్న యాంకర్..
ఇలా ఈ ఫ్రాంక్ వీడియో పై డిబేట్ జరుగుతూ ఉండగా.. నేను డిప్రెసిడ్ అని పేర్కొనడంతో విశ్వక్ సేన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ను స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ డిబేట్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































