Big Boss OTT Telugu: బుల్లితెర పై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్లేస్ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం నిన్నటి నుంచి( ఫిబ్రవరి 26) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తోంది. ఈ కార్యక్రమానికి 17 మంది కంటెస్టెంట్ లు ఎంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిలో రాయలసీమకు చెందిన చొక్కా రపు స్రవంతి బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు.

రాయలసీమలోని కదిరి ప్రాంతానికి చెందిన స్రవంతి తన టాలెంట్ తో సోషల్ మీడియా నుంచి టీవీ దాకా అవకాశాలను అందుకొని ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే గుర్తింపుతో నేడు బిగ్‌బాస్ స్టేజీపై ఐదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన స్రవంతి తన నవ్వుతూనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఈ విధంగా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ఈమె తన జీవితంలో రెండు సార్లు పెళ్ళి చేసుకున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తరువాత పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.అయితే ఈ విషయం ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియదని ఈ సందర్భంగా స్రవంతి వెల్లడించారు.
మాట ఇచ్చిన స్రవంతి…
తన టాలెంట్ తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చి ఓటీటీలో నవరసాలతో ఎంటర్‌టైన్ చేస్తానని మనసావాచా కర్మణా మాటిస్తున్నానంటూ శపథం చేసింది స్రవంతి. మరి మాట ఇచ్చిన విధంగా మాటపై నిలబడుతుందా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

































