Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ కుటుంబం నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో ఉంటారు. నిన్నటి వరకు ఈ కుటుంబం పై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా విష్ణు ఆఫీసులో దొంగతనం జరిగింది అంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మంచు విష్ణు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ సుమారు 5 లక్షల వరకు దొంగతనం చేశాడని విష్ణు మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోని ఈ విషయంపై విష్ణు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ స్పందిస్తూ ఒక సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసలు విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగ శీను మాట్లాడుతూ దొంగతనం విషయంపై అసలు విషయం తెలిపారు.

నాగ శీను గత పది సంవత్సరాల నుంచి మంచు మోహన్ బాబు ఇంటిలో నమ్మకంగా పని చేస్తున్నారని తెలిపాడు. అయితే నేను ఆ ఇంటిలో ఎలాంటి దొంగతనం చేయలేదని మోహన్ బాబు విష్ణు కలిసి తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మోహన్ బాబు విష్ణు నన్ని ఎన్నో అసభ్యకరమైన పదాలతో దూషించారని ఆ పదాలు నా నోటివెంట చెప్పడానికి కూడా అసభ్యకరంగా ఉన్నాయని అలా కులం పేరుతో నన్ను దూషించి అవమానించడమే కాకుండా మోకాళ్ళపై కూర్చోపెట్టి నన్ను కొట్టారనీ కూడా నాగ శీను తెలిపారు.
ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు…
ఈ విధంగా నన్ను చిత్రహింసలకు గురి చేసి దారుణంగా అవమానించడంతో నేను ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ ఇంటి నుంచి వచ్చానని ఇలా రావడంతో నాపై ఈ విధమైనటువంటి దొంగతనం కేసు పెట్టారని నాగ శీను సెల్ఫీ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటన ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 1 గంట సమయంలో జరిగిందని నాగ శీను తెలిపారు. ప్రస్తుతం ఈయన షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై మంచు కుటుంబం ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.






























