ఎవరికైనా హిందూ సంప్రదాయం ప్రకారం ఒక భార్యతో జీవితం కొనసాగిస్తారు. కానీ అతడికి ఏకంగా పది మంది భార్యలను కలిగి ఉన్నాడు. అంతేకాదు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. లగ్జరీ హోటల్ లో మాత్రమే బస చేస్తాడు.

ఆ పది మంది భార్యలను వేరు వేరు నగరాల్లో ఉంచి కాపురం చేస్తున్నాడు. అతడు పెద్ద వ్యాపారవవేత్త కాదు.. అతడు ఒక దొంగ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇంట్లో కోటి రూపాలయల వరకు దొంగ తనం చేసి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో అతడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. అతడి పేరు ఇర్ఫాన్. దేశ విదేశాల్లో తిరుగుతూ దొంగతనం చేస్తూ ఉంటాడు.
ఇలా ఓ రోజు అతడి భార్య పేరు మీదు ఖరీదైన జాగ్వార్ కారును కొనుగోలు చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని కవినగర్ లో దొంగతనానికి వెళ్లి వ్యాపారవేత్త కపిల్ గార్గ్ వద్ద రూ.1 కోటి తీసుకొని పారిపోయారు. అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అతడి కారు నంబర్ ఆధారంగా అతడి ఆచూకీ తెలియడంలో.. అతడి వ్యవహారం మొత్తం బయటకు వచ్చాయి. అంతక ముందే అతడికి వివిధ నగరాల్లో వందల కొద్ది కేసులు ఉన్నట్లు తెలిసింది. ఆ పది మంది భార్యల్లో ఆ కారు గుల్షన్ పేరు మీదు ఉంది. గుల్షన్ ను.. కారు డ్రైవర్ మహ్మద్ షోయబ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇర్ఫాన్ కోసం గాలిస్తున్నారు.






























