Shiaji Shinde: తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు నటి నటుల కంటే ఇతర భాషలకు చెందిన నటీనటులు ఎక్కువగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే చాలామంది తెలుగు నటీనటులు తెలుగు ఇండస్ట్రీలో తమ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. అయినా కూడా తెలుగు వాళ్ళను పక్కకు పెట్టి ఇతర భాషలకు చెందిన నటీనటులను ఎంచుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

ఇక ఈ విషయం గురించే తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కొన్ని విషయాలు తెలిపాడు. ఈయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో చాలా విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా సినిమాల గురించి చాలా విషయాలు తెలిపాడు. ఇతర ఇండస్ట్రీకి చెందిన నటీనటుల్లో మంచి గుర్తింపు ఉన్న నటులను తెలుగు సినీ ఇండస్ట్రీలో తీసుకోవటంలో తప్పులేదు కానీ మామూలు నటులను కూడా తీసుకొని వారికి కీలకపాత్రలు ఇవ్వడం సరైనది కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
దాంతో మరో మరాఠీ నటుడు యాడ్ షిండే గురించి కొన్ని షాకింగ్ కామెంట్ లు చేశాడు కోట. ఇక తెలుగు ప్రేక్షకులకు షియాజీ షిండే గురించి అందరికి తెలిసిందే. చాలా సినిమాలలో అద్భుతమైన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎక్కువగా విలన్ క్యారెక్టర్ లో నటించాడు షిండే. నిజానికి ఈయనను చూస్తే తెలుగు విలన్ అనే భావన అందరికీ కలుగుతుంది. కానీ ఈయన మరాఠీ నటుడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ చిత్రం ద్వారా విలన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
షియాజీ షిండే గురించి వెటకారంగా స్పందించిన కోట..
ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుని విలన్ గా, ఆర్టిస్ట్ గా, కమెడియన్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మామూలు మరాఠీ నటుడు అయిన టాలీవుడ్ లో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈయన గురించి కోట పలు వ్యాఖ్యలు చేశాడు. ఇతర ఇండస్ట్రీకి చెందిన ఈయనకు తెలుగులో యముడికి మొగుడు సినిమాలో యముడు క్యారెక్టర్ ఇవ్వడం ఏంటి అంటూ కాస్త వెటకారంగానే స్పందించాడు. ప్రస్తుతం ఆ నటుడుపై ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.































