AP: ఆంధ్రప్రదేశ్లో రెండు ఎమ్మెల్సీలకి ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరూ ఎమ్మెల్సీలు టిడిపిలోకి వెళ్లిపోవడంతో జగన్ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలోనే ఖాళీ అయిన ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టిడిపి నుంచి పోటీ చేయబోతున్న ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు.

ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కావడంతో కచ్చితంగా ఈ రెండు ఎమ్మెల్సీ పదవులు టిడిపికే వెళ్తాయి అనడంలో సందేహం లేదు ఇక ఈ ఎన్నికలలో వైసిపి పోటీ కూడా చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది టిడిపి నుంచి ఎమ్మెల్సీ బరిలో దిగబోతున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు అనే విషయానికి వస్తే..
వర్మకు మంత్రి పదవి..
ఎస్‌విఎస్‌ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. వర్మ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు. ఈ క్రమంలోనే ఈయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మిగిలిన మంత్రి పదవి కూడా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే హిందూపురంలో బాలకృష్ణ గెలుపుకు ఎంతో సహకరించిన మహమ్మద్ ఇక్బాల్ సైతం ఎమ్మెల్సీ సీటు ఖరారు అయిందని తెలుస్తోంది.





























