Manch Family: తెలుగు పరిశ్రమలో ఎక్కువగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల మధ్యనే ఎక్కువగా పోటీ ఉంటుంది అని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. తన హీరో సినిమా హిట్ అయిందంటే.. లేదు మా హీరో సినిమా హిట్ అయిందంటూ.. వాళ్లకు వాళ్లే కొట్టుకునే పరిస్థితికి వస్తుంది.

కానీ ఇదంత సినిమా వరకే.. నిజ జీవితంలో వాళ్లు కుటంబసభ్యులు బాగానే కలిసి ఉంటారు. ఈ రెండు ఫ్యామిలీలే కాక.. మరో రెండు ఫ్యామిలీలు కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కవగా టాపిక్ అవుతుంటారు. అందులో ముఖ్యంగా.. రాజేశేఖర్ ఫ్యామిలీ అండ్.. మంచు ఫ్యామిలీ.

అప్పుడప్పడు రాజేశేఖర్ ఫ్యామిలీ చిరంజీవికి వ్యతిరేకంగా ఉంటారు అనే వార్తలు వస్తుంటాయి. వాళ్లు పరోక్షకంగా ఒకరపై ఒకరు దూషించుకోవడం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. ఇక తాజాగా మా అధ్యక్ష ఎన్నికలో మాత్రం.. ఒకరిపై ఒకరు అసహనం ఎంత వరకు ఉందనేది తెలిసిపోయింది.
మోహన్ బాబు యూనివర్సిటీగా..
ఇటు మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే.. మంచు ఫ్యామిలీ అంతా మరో వైపు ఉండి పోరాడారు. చివరకు మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు.. మంచు మోహన్ బాబు.. ఇటు విలన్ గా.. అటు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఒక్క సినీ రంగంలోనే కాదు అతడికి ప్రత్యేకంగా విద్యా సంస్థ కూడా ఉందన్న విషయం తెలసిందే. గత కొంతకాలంగా అతడు కుల మతాలకు అతీతంగా.. 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ విద్యను అందిస్తున్నాడు. ఇక ఈ ఫ్యామిలీ చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చింది.. వీళ్లకు సంబంధించిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా వచ్చింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మోహన్ బాబు. దీనికి సంబంధించి మోహన్ బాబు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. మీ ప్రేమ, అండదండలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఈ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీగా(ఎంబీయూ(MBU)) ఉంటుందన్నారు.
With the blessings of my parents, all my fans and well wishers, I am a humbled and honored to announce #MBU #MohanBabuUniversity pic.twitter.com/K8HZTiGCUA
— Mohan Babu M (@themohanbabu) January 13, 2022
































