సాధారణంగా మన భారతదేశంలో ఒక విస్కీ బాటిల్ కొనాలంటే వేలల్లో మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఇదే విస్కీ బాటిల్స్ ఇతర దేశాలలో అయితే ఆయా తయారు కంపెనీలను బట్టి వాటి ధరలు వేల రూపాయలు నుంచి లక్షల వరకు పలుకుతుంటాయి.అయితే ఇక్కడ మాత్రం ఓ విస్కీ బాటిల్ వేలం వేయగా ఏకంగా కోటి రూపాయలకు అమ్ముడుపోయింది. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. విస్కీ బాటిల్ ఏంటి.. కోటి రూపాయలు పలకడం ఏంటి.. అనుకుంటున్నారా.. అయితే ఆ బాటిల్ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

వేలంపాటలో అత్యంత ధర పలికిన ఈ విస్కీ బాటిల్ పేరు ఓల్డ్ ఇంగ్లెడ్వ్. ఈ విస్కీ బాటిల్ లో సుమారుగా 1860 లో తయారు చేశారు. సుమారు 250 సంవత్సరాల క్రితం నాటి విస్కీ బాటిల్ ను ఇంగ్లాండ్ లోని ప్రముఖ వేలం సంస్థ స్కిన్నార్ ఇంక్ వేలం వేసింది. ఈ వేలం పాటలో ఈ విస్కీ బాటిల్ ఊహించిన దాని కన్నా అధిక రెట్లు ధర పలకడంతో వేలం నిర్వాహకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అతి పురాతనమైన ఈ విస్కీ సీసాను వేలం వేయగా
మిడ్‌టౌన్ మాన్హాటన్‌లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీ 137,500 డాలర్లకు కొనుగోలు చేసింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.1,02,63,019 ధర పలికింది. కేవలం ఈ పురాతనమైన విస్కీ సీసాను వేలం వేయగా 20 డాలర్ల వరకు వస్తాయని సదరు సమస్త భావించింది.అయితే వారు అనుకున్న దాని కన్నా అధిక రెట్లు అమ్ముడుపోవడంతో వేలం నిర్వాహకులు ఎంతో ఆనంద పడ్డారు.
వేలంపాటలో లభించిన ఈ విస్కీ బాటిల్ 250 సంవత్సరాల క్రితంది అయినప్పటికీ అందులోని విస్కీ వంద సంవత్సరాల క్రితందని తెలిపారు. అయితే సాధారణంగా మూత తీయకుండా సీసాలో పది సంవత్సరాలపాటు నిల్వ ఉన్న మధ్యాన్ని తాగవచ్చు. కానీ ఇలా వందల సంవత్సరాల తరబడి ఉన్న మద్యం తాగడానికి పనికి రాదని, ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.




























