Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ ని కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. ఈయన కూడా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నా రామ్ చరణ్ బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఇక రామ్ చరణ్ ఏదైనా ఒక సినిమాకి కమిట్ అయ్యారు అంటే తప్పనిసరిగా ఆ సినిమా కథ చిరంజీవి గారు కూడా వినాల్సిందే .ఆయన ఓకే చెప్పిన తర్వాతే రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అయితే ఓసారి మాత్రం చిరంజీవి ఎంత వద్దని చెప్పినా రామ్ చరణ్ మాత్రం ఓ సినిమాకు కమిట్ అయ్యి తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు.

ఈ విధంగా చిరంజీవి వద్దని చెప్పిన వినకుండా రాంచరణ్ నటించిన ఆ సినిమా ఏంటి అనే విషయాన్ని వస్తే అది మరి ఏదో కాదు బాలీవుడ్ డెబ్యూ మూవీ జంజీర్. తెలుగులో ఈ సినిమా తుఫాన్ పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అపూర్వ లఖియా దర్శకత్వంలో జంజీర్ అనే యాక్షన్ క్రైమ్ మూవీలో హీరోగా ఛాన్స్ రావడంతో చిరు చరణ్ ఇద్దరు కథ విన్నారు.

బాలీవుడ్ లో విమర్శలు…
ఈ కథ రామ్ చరణ్ కు విపరీతంగా నచ్చింది కానీ చిరంజీవి మాత్రం ఈ సినిమా నీకు సెట్ అవ్వదు వద్దని చెప్పినా వినకుండా ఈ సినిమాలో నటించారట. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పూర్తిస్థాయిలో నెగిటివ్ టాక్ రావడమే కాకుండా బాలీవుడ్ మీడియా చరణ్ లుక్స్ అలాగే ఆయన నటనపై తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేశారు. ఈ దెబ్బకు ఈయన చిరంజీవి వద్దన్నా సినిమా వంక కన్నెత్తి కూడా చూడరని తెలుస్తోంది.



























