Avasarala Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా డైరెక్టర్ గా నటుడిగా అందరికీ ఎంతో సుపరిచితమైన అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు సినిమాలలో నటుడిగా తన అద్భుతమైన కామెడీతో మెప్పించడమే కాకుండా సినీ రచయితగా కూడా పేరు పొందారు.ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఈ విధంగా ఇండస్ట్రీలో నటుడిగా రచయితగా దర్శకుడిగా పేరు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ కెరియర్ లో పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.ఈ విధంగా తన కెరియర్ సక్సెస్ కాకపోవడానికి కారణం ఏమిటి అనే విషయం గురించి తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సక్సెస్ అనే పదమే నచ్చదని తెలిపారు. తన వరకు తాను ఎంతో సక్సెస్ అయ్యాయని ఒక నటుడిగా రచయితగా డైరెక్టర్ గా తను ఎంతో సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.

సక్సెస్ అనేది మనకు మంచి పేరు తెచ్చి పెట్టడం కాదు మనం చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయి , మన సినిమాలను ప్రేక్షకులు ఆదరించినప్పుడే నిజమైన సక్సెస్ అంటూ ఆయన తెలిపారు.అష్టాచెమ్మ సినిమా చేసిన తర్వాత చాలామంది తన వద్దకు వచ్చి ఈ సినిమా కూడా అష్టాచెమ్మ మాదిరే ఉంటుంది అంటూ కథలు చెప్పేవారు. ఒకే తరహా సినిమాలు ఎన్ని చేస్తాం అందుకే తాను పెద్దగా సినిమాలలో నటించలేదని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు…
ఇకపోతే టాలీవుడ్ నటుడు విజయ్ సాయి మరణం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మరణం గురించి అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ అతను ఇండస్ట్రీలో ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఉన్నారు అంటూ తెలిపారు. అయితే ఆయన ఎప్పుడూ కలిసిన ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ చెప్పేవారు.ఇలా కెరీర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయసాయి మరణించాడనే వార్త వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా అవసరాల శ్రీనివాస్ విజయసాయి మరణం గురించి తెలిపారు.
































