Big Boss Sunny: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా ఎంపికై చివరికి విజేతగా నిలిచిన సన్నీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన ఈయన పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే తాజాగా ఒక సినిమా షూటింగ్ కోసం సన్నీ మరియు చిత్ర బృందం హైదరాబాద్లోని హస్తినాపురం ప్రాంతంలో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక రౌడీషీటర్ ఉన్నఫలంగా సన్నీ పై దాడికి ప్రయత్నించాడు. అయితే ఈ విషయం గమనించిన సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ క్రమంలోనే సిబ్బంది అలర్ట్ అవుతూ సన్నీని సురక్షితంగా కారులో పంపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా రౌడీషీటర్ సన్నీ పై దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి? ఎవరి ప్రమేయంతోనైనా ఇలా దాడికి ప్రయత్నించాడా అనే విషయాల గురించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆందోళనలో సన్నీ అభిమానులు…
ఈ విధంగా సన్ని పై దాడి చేశారని తెలియడంతో అభిమానులు కొంతమేర ఆందోళన చెందారు. అయితే సన్నీ పై దాడి చేయాల్సిన అవసరం ఆ వ్యక్తికి ఏముంది. ఎందుకు దాడికి ప్రయత్నించారు అంటూ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ విధంగా రౌడీషీటర్ సన్ని పై దాడి చేయడానికి గల కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.
































