Nagachaitanya: నాగచైతన్య తాజాగా నటి శోభితను నిశ్చితార్థం చేసుకోవడంతో ఈయనకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య శోభితను నిశ్చితార్థం చేసుకోవడంతో మరోసారి నాగచైతన్య సమంత విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం సమంతనే అప్పట్లో సమంత ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. సమంతకు సినిమాలలో నటించడానికి అడ్డు చెప్పారని అలాగే పిల్లల్ని కనడం ఇష్టం లేని సమంత నాగచైతన్యతో గొడవపడి విడాకులు తీసుకుందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జూకల్కర్ తో కూడా సమంతకు ఎఫైర్ అంటగట్టి తనని ఎంతగానో మానసిక వేదనకు గురి చేశారు.
ఇలా తన గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ప్రీతం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.కంగ్రాట్స్ పతిత.. ఇప్పుడు అతడు నీ వాడు. రహస్యాలు, అబద్ధాలు బంధాలను నాశనం చేస్తాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతారని ఇన్‌స్టా స్టేటస్ లో ప్రీతం రాసుకొచ్చాడు. ఆ సమయంలో ఈయన ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ చేశారన్నది అర్థం కాలేదు.
శోభితతో రిలేషన్..
తాజాగా నాగచైతన్య శోభితం నిశ్చితార్థం జరుపుకోవడంతో మరోసారి ప్రీతం చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆరోజు శోభితను ఉద్దేశించే ఈయన ఇలాంటి పోస్ట్ చేశారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇలా శోభిత నాగచైతన్య రిలేషన్ లో ఉండటం వల్లే సమంతకు విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని తాజాగా వీరిద్దరి విడాకులకు సంబంధించిన అసలు విషయం బయటపడింది.



























