బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముక్ ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇద్దరు కలిసి గేమ్ ఆడటం నిత్యం ఒకరినొకరు అంటిపెట్టుకొని ఉండడంతో వీరి వ్యవహార శైలి గురించి నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ముందు బిగ్ బాస్ హౌస్ నుంచి వీరిని బయటకు పంపించడం ఎంతో మంచిది అంటూ కామెంట్లు కూడా చేశారు.

ఇదిలా ఉండగా కంటెస్టెంట్ లో ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపినప్పుడు సిరి తల్లి, షణ్ముఖ్ మదర్ కూడా వీరిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకోవడం నచ్చలేదంటూ వారికి బాగా క్లాస్ పీకారు.దీంతో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున చేయలేని పని వీళ్లు చేశారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇక అప్పటి నుంచి వీటి మధ్య ఎలాంటి హగ్, కిస్ లు లేవు.
తాజాగా అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుతూ ఉండగా సిరి షణ్ముఖ్ ను ఉద్దేశిస్తూ నేను బయటకు వెళ్లిన తర్వాత ఎపిసోడ్ చూస్తాను ఏమైనా తేడా వస్తే అప్పుడు చెబుతాను అంటూ అనడంతో అందుకు షన్ను మా పాప దీప్తి నీకు అంత ఛాన్స్ ఇవ్వదు అంటూ కౌంటర్ వేయడంతో అక్కడి నుంచి సిరి అలిగి మోజ్ రూమ్ కి వెళ్తుంది.
ఇక అక్కడికి వెళ్ళిన ఆమె ఎవరిని నమ్మకూడదు, గుడ్డిగా అందర్నీ నమ్మేస్తా అంటూ బాధపడింది. వెంటనే షన్ను వెళ్లడంతో ఎవరైనా ఒక మాట అనే ముందు ఆలోచించవా అలాగే అనేస్తావా అంటూ అతనిని నిలదీసింది. దీంతో తనకు సారీ చెప్పమని అలాగే హగ్ ఇవ్వమని సిరి అడగడంతో అందుకు షన్ను మళ్లీ మీ అమ్మగారు వస్తారు వద్దు బాబోయ్ అంటూ భయపడ్డాడు. సిరి హగ్ ఇస్తూ ఇది ఓన్లీ ఫ్రెండ్ షిప్ అంటూ ఇద్దరూ కలిసి సరదాగా మాటలు పెట్టారు దీంతో వీరి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది అంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




























