K.R Vijaya: చెల్లెలు చనిపోయిందని తెలియక పాలు పట్టించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్… విషయం తెలిసి అలా!

0
1053

Actress K.R Vijaya:దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కె.ఆర్.విజయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలిన ఈమె వయసు పైబడటం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Actress K.R Vijaya: చెల్లెలు చనిపోయిందని తెలియక పాలు పట్టించిన స్టార్ హీరోయిన్… విషయం తెలిసి అలా!

ఇలా అగ్రతారగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయతన జీవితంలో చిన్నప్పుడు జరిగిన ఒక విషాద సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేస్తూ ఆ విషయాన్ని తలచుకొని బాధపడ్డారు. ఇలా తన జీవితంలో చోటు చేసుకున్న ఆ విషాద సంఘటన ఏమిటి అనే విషయానికి వస్తే…

Actress K.R Vijaya: చెల్లెలు చనిపోయిందని తెలియక పాలు పట్టించిన స్టార్ హీరోయిన్… విషయం తెలిసి అలా!
Actress K.R Vijaya: చెల్లెలు చనిపోయిందని తెలియక పాలు పట్టించిన స్టార్ హీరోయిన్… విషయం తెలిసి అలా!

విజయ చిన్న వయసులో ఉన్న సమయంలో తన తల్లికి తన చెల్లికి అనారోగ్యం చేసింది .అయితే తన చెల్లెలు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మూడు మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లి తన చెల్లికి బాగా లేదనే విషయాన్ని కూడా డాక్టర్ కి చెప్పడానికి రాకపోవడంతో డాక్టర్ తన తల్లికి జబ్బు చేసి ఉంటుందని భావించారట.

డాక్టర్ అశ్రద్ధగా ఉంటూ ఆమె ఒంట్లో బాగా లేదని చెప్పింది వాళ్లమ్మగారికి అనుకొని, “సరే.. నేనొచ్చి చూసుకుంటాలే” అని ఆలస్యంగా వెళ్ళిన తన ఇచ్చే మందులు ఎంతో బాగా పని చేస్తాయని భావించారు. ఇలా డాక్టర్ వస్తానని చెప్పి పంపించడంతో విజయ ఇంటికి వెళ్ళింది. ఈ విధంగా ఇంటికి వచ్చిన ఆమె పడుకున్న తన చెల్లెలిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాల సీసా తీసుకుని తన చెల్లికి పాలు పట్టించింది.

ఆర్థిక స్తోమత లేకపోవడమే…

అయితే ఆ చిన్నారి కళ్లు మూసుకుని ఉండడంతో నిద్రపోతోందని భావించింది విజయ. ఇక ఇది గమనించిన ఇతర కుటుంబ సభ్యులు చూసి గట్టిగా ఏడవడంతో విజయకు అప్పుడే తెలిసింది తను ఇంతవరకు చనిపోయిన తన చెల్లెకు పాలు పట్టించానని. తన చెల్లి చనిపోయిందని తెలియడంతో ఎంతో మదన పడింది.అయితే సరైన సమయానికి వైద్యం అందక పోవడం వల్ల తన చెల్లి మరణించిందని ఆరోజు ఆమె ధరించిన ఆ డ్రస్ చాలాకాలం వరకు తన దగ్గర ఉంచుకొని ఆ డ్రెస్సులో తన చెల్లిని చూసుకుంటున్నానని విజయ తెలిపారు.ఆ రోజు సరైన సమయానికి వైద్యం అంది ఉంటే తన తల్లి బతికేదని అప్పుడు అంత స్థోమత లేకపోవడం వల్ల తన చెల్లి దూరమైందని ఇప్పుడు అన్ని ఉన్నా కూడా తిరిగి తన చెల్లెలు తిరిగిరాదని విజయ చెప్పుకొచ్చారు.