ఈ ప్రపంచంలో నిత్యం జరిగే వాటిలో సూర్యోదయం, సూర్యాస్తమయం నిత్యం జరిగే ప్రక్రియ. ఉదయం సూర్యోదయం అవ్వడం సాయంత్రం సూర్యాస్తమయం అవడం జరుగుతుంటుంది. కొన్ని ప్రాంతాలలో కొద్దిగా అటోఇటో సూర్యోదయం, సూర్యాస్తమయం జరిగిన ఈ రెండు ప్రక్రియలు నిత్యం జరిగేవే. అమెరికా వంటి దేశాలలో మనకు పగలయితే వారికి రాత్రి అవుతుంది.

సమయాలలో తేడా వల్ల ఇలా జరగడం సర్వసాధారణమే. కానీ మీరు ఎప్పుడైనా సూర్యోదయం అయిన కొద్ది గంటల వ్యవధిలోనే సూర్యాస్తమయం అవడం ఎప్పుడైనా చూశారా? అలాంటి విచిత్ర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో సూర్యుడు దాదాపు రెండు నెలలపాటు ఉదయించడు. ఈ రెండు నెలల పాటు ఆ ప్రాంతమంతా చీకటిమయంగా మారిపోతుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఏమిటో ఎందుకలా జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…

అమెరికాలోని ఉత్తర దిక్కున ఉన్న అలస్కాలోని ఉట్కియావిక్లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రాంతంలోనే సూర్యుడు ఉదయించిన కొద్ది గంటలకే సూర్యాస్తమయం జరిగి తిరిగి దాదాపు రెండు నెలల పాటు ఇక్కడ సూర్యుడు ఉదయించడు. ఈ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు చివరిగా సూర్యాస్తమయం జరిగి ఆ ప్రాంతమంతా చీకట్లు కమ్ముకున్నాయి. ఈ ప్రాంతంలో తిరిగి సూర్యుడు 2021 జనవరి 22వ తేదీ ఉదయిస్తాడు.

ఆ ప్రాంతంలో దాదాపు 65 రోజులపాటు సూర్యుడు ఉదయించకుండా పగలు లేకుండా కేవలం చీకటిలో మాత్రమే ఆ ప్రాంత ప్రజలు నివసిస్తారు. ఆ ప్రాంతంలో దాదాపు రెండు నెలలు చీకటిగా ఉండి మరో రెండు నెలల పాటు పగలు ఏర్పడి ఉంటుంది. దీర్ఘకాలికంగా రాత్రులు ఈ ప్రాంతంలో ఏర్పడటం వల్ల ఈ రాత్రులను “పోలార్ రాత్రి” అని కూడా అంటారు

ఈ రాత్రి సుమారు 320 కిలోమీటర్ల ప్రాంతం వరకు వ్యాపించి ఉంటాయి. ఈ ప్రాంతంలో పగలు సూర్యుడు లేకుండా చీకటిగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాలలో సూర్యుడు ఉదయించినప్పటికీ పూర్తి కాకుండా వెన్నెల రాత్రిని తలపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో చివరి సూర్యాస్తమయం జరిగిన సమయాన్ని ఉట్కియావిక్లో నివసిస్తున్న @kirsten_alburg అనే వ్యక్తి తన కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ ఫోటోని షేర్ చేశారు. ఫోటో షేర్ చేసిన కొద్ది సేపటికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here