వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరెన్నో కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. ఇంట్లో పెద్ద దిక్కు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న కటుంబాలు ఎన్నో ఉన్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

తాజాగా జరిగిన ఘటనలో.. వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం చేసిన ఘటన బోరబడం పరిధిలో కొద్దిరోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోరబండకు చెందిన ఓ మహిళ.. వెంకట్ అనే యువకుడితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని అదే కాలనీకి చెందిన ఇస్మాయిల్ అనే యువకుడు గమనించాడు.
ఓ రోజు వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆ రోజు నుంచి ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. తన కోరిక తీర్చకపోతే.. ఈ వీడియోలు, ఫొటోలు బయటపెడతానని భయపెట్టాడు. ఓ రోజు ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెపై ఇస్మాయిల్, యాసిన్ కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఇలా అతడు ఒక్కసారి కాదు.. పదే పదే ఇలానే చేస్తుండటంతో విసుగిపోయి.. తన ప్రియుడికి వెళ్లి చెప్పింది.
ఇద్దరు కలిసి పొలంలోకి వెళ్లి అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డారు. వారిద్దరు అలా అపస్మారక స్థితిలో ఉండగా.. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుపోవడంతో.. చికిత్స నిర్వహించిన అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. తర్వాత వారిద్దరి పోలీసులు ప్రశ్నించడగా.. విషయాన్ని చెప్పారు. ఆ జంట ఫిర్యాదు మేరకు యాసిన్, ఇస్మాయిల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

































