Allu Arjun – Prabhas: బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా బాహుబలి తర్వాత ఈయన నటించిన ప్రతి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఇలా టాలీ వుడ్ నుంచి పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.

ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమా మంచి వసూళ్లను రాబట్టడంతో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు, అల్లుఅర్జున్ అభిమానుల మధ్య వార్ మొదలైంది.ఈక్రమంలోనే అసలుసిసలైన పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ అంటే.. ప్రభాస్ అని ఇద్దరి అభిమానుల మధ్య గొడవ జరుగుతూనే ఉంది.
తెలుగులో మిశ్రమ స్పందన దక్కించుకున్న పుష్ప..
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.అనూహ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా విజయవంతమై అత్యధిక కలెక్షన్లను రాబట్టి సినిమా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా పుష్ప సినిమా మంచి విజయం కావడంతో నిజమైన పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ అంటూ ఆయన అభిమానులు కాలర్ ఎగరే స్తున్నారు. దీంతో వీరిద్దరి అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధం నడుస్తుందని చెప్పాలి. అయితే ఇలా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఇలాంటి గొడవలు రావడం సర్వ సాధారణంగా జరిగే విషయమనే చెప్పాలి.

































