Sarkaru Vaari Paata: సాధారణంగా ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు ఎంతో మంది హీరోల తలరాతలు మారిపోతాయి.అప్పటి వరకూ ఎంతో క్రేజ్ ఉన్న హీరోలు కూడా ఒక్కోసారి డిజాస్టర్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదా సూపర్ హిట్ సినిమాలను కూడా అందుకుంటారు.

ఈ విధంగా ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ ఎంతో మంది హీరోల తలరాతను మారుస్తుంది. ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబుకు థియేటర్ సెగ కాకుండా మెగా సెగ భారీగా తగిలిందని చెప్పాలి. ఈ సినిమా మొదటి షో నుంచి మెగా అభిమానులు పెద్ద ఎత్తున సినిమా డిజాస్టర్ అంటూ ట్రోల్ చేసారు.

ఈ విధంగా మెగా అభిమానులు కుట్ర చేయడంతో మహేష్ అభిమానులు ఘాటుగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇదే కాకుండా మరిన్ని దారుణాలకు కూడా పాల్పడ్డారని చెప్పాలి.ఇదిలా ఉండగా ఇంకో జుగుప్సాకరమైన హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో మహేష్ బాబు ఇమేజ్ దారుణంగా పడిపోయింది.
మరీ ఇంత దారుణమా…
ఈ విధంగా మహేష్ బాబు పరువు తీసిన వారిలో మహేష్ బాబు అభిమానులు కూడా ఉండటం గమనార్హం. రాయడానికి కూడా వీలులేని రీతిలో మహేష్ బాబు గురించి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు.మెగా రంకు మొగుడు మహేష్ అని పేరు పెట్టారు. దీనికి ప్రతీకగా మరి కొన్ని దారుణమైన హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేశారు మహేష్ అభిమానులు. చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు ఎంతో జెంటిల్ మెన్ గా వ్యవహరిస్తారు. అలాంటి మహేష్ బాబు సినిమా పట్ల ఇంత దారుణానికి పాల్పడిన వారు ఎవరు? ఈ కుట్ర వెనుక ఎవరి ప్రమేయం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
































