Movie Tickets : అందితే జట్టు.. అందకపోతే కాళ్లు ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి. ఏపీలో టికెట్ రేట్లు తక్కవ చేయడంతో పెంచాలని ప్రభుత్వాన్ని కోరతున్నాయి. మరో వైపు తెలంగాణలో టికెట్ రేట్లను విపరీతంగా పెంచడం పలు వివాదాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ జరగుతోంది.

థియేటర్ల ధరలను ప్రభుత్వం తగ్గించడంతో వివాదం చెలరేగింది. టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయంటూ.. పలువురు సిని ప్రముఖులు కూడా ప్రభుత్వం నిర్ణయంపై బహిరంగంగానే తమ అసంత్రుప్తిని వెల్లడించారు. హీరో నాని ఇటీవల థియేటర్ల కలెక్షన్లపై కూడా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వ్యాఖ్యాలు చేశాడు.
థియేటర్ల కలెక్షన్లు కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కూడా ఇదే స్థాయిలో స్పందించారు. ఏపీలో టికెట్ రేట్లను రూ. 200, రూ. 150, రూ. 100కు పెంచాలని టాలీవుడ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరకుంటుంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్లను విపరీతంగా పెంచుతుంది.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను..
ఇక్కడ టికెట్ రేట్లను రూ.350, 290,175 పెంచాలని డిమాండ్ చేస్తోంది. దీనికి అనుగుణంగానే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను విపరీతంగా పెంచింది. దీంతో చిన్న సినిమాకు పెద్ద చిక్కువచ్చిపడింది. ఇదిలా ఉంటే చిన్న సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఎవరూ వచ్చే పరిస్థితి ఉండదని పలువురు చిన్న నిర్మాతలు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరు అందితే జుట్టు… అందకపోతే కాళ్లు అన్న రీతిలో ఉంది. ఏపీలో టికెట్ రేట్లు ఒక వేళ పెంచినా.. టాలీవుడ్ అడుగుతున్న రేట్లు తెలంగాణ.. రేట్ల కన్నా తక్కువగానే రిజనబుల్ గానే ఉంటున్నాయి. తెలంగాణలో విపరీతంగా పెరిగిన రేట్లపై సాధారణ ప్రజానీకం భరించేలా లేవు. ఒక్కసారి థియేటర్లలో సినిమాకు వెళ్తే ఒక్కో ఫ్యామిలీకి రూ. 2000 వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది.































