కొన్నిసార్లు కోర్టులు చేసే వ్యాఖ్యలు సంచలనాలను సృష్టిస్తాయి.ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలకు మగాళ్ళందరూ ఏకమై తమకి కూడా ఆ చట్టం వర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. మద్రాస్ హైకోర్టు ఒక కేసు తీర్పులో భాగంగా అయ్యో… మగాళ్లకు ప్రత్యేక గృహ హింస చట్టం అనేది లేదు అన్న క్రమంలో ఈ వ్యాఖ్యలపై మగాళ్లు పెద్ద ఎత్తున వారికి ఆ చట్టం వర్తించని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుత కేసు విషయానికి వస్తే డాక్టర్ పి.శశికుమార్ చెన్నైలో పశు సంవర్థక శాఖలో డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఐతే… ఆయన భార్య అతని పై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విధంగా భర్తపై భార్య గృహ హింస కేసు పెట్టడంతో సంబంధిత శాఖ ఉన్నత అధికారులు సదరు డాక్టర్ ను సస్పెండ్ చేశారు.
తన భార్య పెట్టే టార్చర్ భరించలేక తనతో దూరంగా ఉండాలని భావించిన శశికుమార్ 2015 వ సంవత్సరంలో విడాకుల కోసం అప్లై చేశారు. ఈ క్రమంలోనే ఒక నాలుగు రోజులలో విడాకులు వస్తాయన్న క్రమంలో మహిళ అతనిపై గృహ హింస కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.2015లో సాలెం కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకోగా ఫిబ్రవరి 2020లో విడాకులకు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది.
ఈ విధంగా గృహ హింస కేసు నమోదు కావడంతో అతనిని సస్పెండ్ చేయడాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు అతనిని తన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని… తిరిగి మరో 15 రోజులలో అతను ఉద్యోగంలో చేరవచ్చని తీర్పు ఇచ్చింది.సందర్భంగా జస్టిస్ వైద్యనాథన్ ఓ వ్యాఖ్య అన్నారు. “భార్యాభర్తలు ఓ విషయాన్ని గ్రహించాలి. ఇగో, అసహనం అనేవి చెప్పులు లాంటివి వాటిని బయటకు వదలాలి కాని లోపలికి తీసుకెళ్లకూడదు తెచ్చుకుంటే భార్య ,పిల్లలు ఎంతో దుర్భరమైన జీవితాన్ని భరించాల్సి ఉంటుందని జస్టిస్ వైద్యనాథ్ తెలిపారు.



























