బుల్లి తెర ప్రైక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న బిగ్ బాస్ షో తుది అంకానికి చేరుకుంది. వచ్చే వారమే ఎవరు గెలుస్తారో తెలియనుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఫైనలిస్టులపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక కంటెస్టెంట్లను గెలిపించే బాధ్యత అభిమానులపై ఉంది.

డిసెంబర్ 19న జరుగనున్న గ్రాండ్ ఫినాలేలో ఎవరు గెలుస్తారో తెలియనుంది. అయితే గ్రాండ్ ఫినాలేను ఘనంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు సినీ స్టార్లనే కాకుండా బాలీవుడ్ స్టార్లను పిలచి బిగ్ బాస్ షోను గ్రాండ్ గా ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట్లో ట్రిపుల్ ఆర్ టీమ్ ను ప్రత్యేక అతిధులుగా పిలుస్తామని ప్రచారం జరిగింది.
కానీ టాలీవుడ్ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ స్టార్లను పిలువనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనేతో పాటు బాలీవుడ్ మరోస్టార్ ట్రిపుల్ ఆర్ హీరోయిన్ అలియా భట్ ను కూడా ప్రత్యేక అతిధులుగా హాజరవ్వచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇదే కాకుండా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా అతిథిగా హాజరవనున్నట్లు తెలుస్తోంది. ఇంతమంది స్టార్లను ఒకే సారి స్మాల్ స్క్రీన్ పై చూస్తే అభిమానుల కనులవిందే.. అయితే వారేనా.. ట్రోఫి అందించేందుకు మరెవరైనా అతిధులు వస్తారా.. అనేది ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.



























