భారతదేశంలో శాఖాహారంతో పోలిస్తే మాంసాహారం తీసుకునే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మాంసాహారం తీసుకోవడం మంచిదే కానీ అతిగా మాంసాహారం తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. మాంసం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి చాలామంది మాంసాహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే ఊబకాయంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.

మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్య వేధించే అవకాశం ఉంటుంది. మాంసంలో ఫైబర్ ఉండదు కాబట్టి ఈ సమస్య వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతిగా మాంసం తీసుకునే వాళ్లు తలనొప్పితో బాధ పడే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసాహారం కణాల పునరుత్పత్తి రేటును తగ్గించడంతో పాటు కంటి సమస్యలకు కారణమవుతుంది.

మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ప్రోటీన్ల మొత్తం పెరిగితే ఎముకల పనితీరుపై ప్రభావం పడుతుందని.. మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్లు కాల్షియం సమస్యతో బాధ పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అతిగా మాంసాహారం తీసుకుంటే త్వరగా అలసిపోయే అవకాశాలు ఉంటాయి.

ప్రొటీన్ జీర్ణం కావడానికి శక్తి మరియు పోషకాలు అవసరమవుతాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు సైతం వేధించే అవకాశం ఉంటుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు సైతం ఎక్కువగా ఉంటాయి. మాంసాహారం తినేవారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here