Bigg Boss Winner: సినీ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తున్నాము. అయితే ఒక సీరియల్ నటి ఏకంగా తన భర్త ఉండగానే మరొక నటుడితో ఎఫైర్ పెట్టుకొని ఆయనతో మూడేళ్లు సహజీవనం చేస్తూ చివరికి వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సీరియల్ నటిగా కొనసాగుతున్న వారిలో దీపికా కక్కర్ ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఎయిర్ హోస్టస్ గా పని చేసేవారు.

ఇలా ఎయిర్ హోస్టస్ గా పని చేస్తున్న ఈమె ఫైలేట్ రౌనక్ శాంసన్ అనే అబ్బాయిని 2011వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమె పెళ్లి తర్వాత సీరియల్స్ లో నటించే అవకాశం రావడంతో బుల్లితెర అవకాశాలు అందుకున్నారు. అదే సమయంలోనే నటుడు షోయబ్ ఇబ్రహీం అనే నటుడితో ఒక బుల్లితెర షోలో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది.
ఇలా ఈయనతో పరిచయం కారణంగానే తన భర్తకు 2015 వ సంవత్సరంలో విడాకులు ఇచ్చి మూడేళ్లపాటు నటుడు షోయబ్ తో రిలేషన్ లో ఉన్నారు. ఇక తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఈమె కుటుంబంతో పాటు సమాజంతో కూడా పోరాటం చేశారు. తనని పెళ్లి చేసుకోవడానికి మతం అడ్డు రావడంతో ఏకంగా దీపిక మత మార్పిడి కూడా చేశారు.
మతం మార్చుకున్న నటి..
ఇస్లాం మతంలోకి చేరిన ఈమె 2018 వ సంవత్సరంలో షోయబ్ ను వివాహం చేసుకున్నారు. ఇలా వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటిస్తున్న ఈమె బిగ్ బాస్ 12వ సీజన్లోకి వెళ్లి విన్నర్ గా బయటకు వచ్చారు. ఇలా మతం మార్చుకొని ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె ఇటీవల ఆలయానికి రావడంతో ఈ విషయంపై పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరోసారి ఈమె వ్యవహారం వివాదాలలో నిలిచింది.



























