అమరావతి: వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్‌లను “సైకోలు”గా అభివర్ణిస్తూ, వారిచేత జగనే మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు.

“పరిశ్రమల ఏర్పాటుకు చాలా మంది ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పెట్టుబడులు రావని నీచంగా వైసీపీ సైకోలు ఆలోచన చేస్తున్నారు” అని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆయన పరోక్షంగా విమర్శించారు.

































