Best Supporting Actors: ఒక సినిమా విజయవంతంగా ముందుకు సాగాలంటే.. అందులో కథతో పాటు.. నటించే వాళ్ల ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఒకరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే.. మరొకరికి తక్కువ ప్రాదాన్యత ఉంటుంది. అయితే సెంటిమెంట్, ఫైట్స్ , పాటలు, ఎడిటింగ్ ఇలా అన్నీ బాగా కుదిరితే.. ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే ఇక్కడ కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా చేసిన వాళ్లు ఆ సినిమాకే పెద్ద హైలెట్ గా నిలిచారు. వాళ్లు ఎవరు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. అందులో ముఖ్యంగా..

బండారి జగదీష్.. ఇతడు పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ చేశాడు. సినిమా బిగినింగ్ నుంచి చివరి వరకు కూడా.. అతడు హీరోతోనే ఉంటూ.. కామెడీ పంచ్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడికి ఈ సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు ఇతడు పలాస సినిమాలో నటించాడు.

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈమె ఈ సంవత్సరం విడుదలైన క్రాక్ చిత్రంలో నటించింది. ఆ క్యారెక్టర్ కు ఆమె తప్ప ఎవరూ సూట్ కారన్న రేంజిలో నటించింది. ఇప్పుడు సమంత ‘యశోద’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

ప్రకాష్ రాజ్.. ఈ పేరు తెలియని వారుండరేమో. అంతాలా అతడు నటనకు ప్రాణం పోసి జీవిస్తాడు. ఈ సంవత్సరంలో వచ్చిన వకీల్ సాబ్ లో అతడు లాయర్ పాత్ర పోషించాడు. లాయర్ నందాగ మరోసారి అద్భుతంగా నటించాడు.

కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు సినిమాలో కాజల్ ఓ కీలక పాత్ర పోషించింది. అను పాత్రకు ప్రాణం పోసింది. సినిమా ఫ్లాప్ అయినా కాజల్ ది బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా నిలిచింది.

రాజీవ్ కనకాల.. వెంకటేష్ OTT చిత్రం నారప్పలో రాజీవ్ కనకాల సూపర్ సపోర్టింగ్ రోల్ పోషించారు. చాలా రోజుల తర్వాత రాజీవ్ ఇంత పెద్ద పాత్రలో నటించారు. నారప్ప బావమరిది బసవయ్య పాత్రకు ప్రాణం పోయడమే కాకుండా.. కథను ముందుకు తీసుకెళ్లే పాత్రలో రాజీవ్ కనకాల కనిపించారు.
కథను మలుపు తిప్పే పాత్రలు అవి..

రమ్యకృష్ణ.. రమ్య కృష్ణ చిత్రం రిపబ్లిక్. దీనిలో ముఖ్యమంత్రి విశాఖ వాణి పాత్ర పోషించింది . ధరమ్ తేజ్ హీరో. దీనిలో ఆమె నటన నీలాంబరిని గుర్తు చేసింది.

జగపతిబాబు.. బాలయ్య అఖండ సినిమాలో జగపతిబాబు అఘోర బాబా పాత్ర కీలకం. కథని మలుపు తిప్పే పాత్ర ఇది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.ఈ సినిమా భారీ విజయం సాధించింది.






























