Actor Josh Ravi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా అవకాశాల కోసం కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీ చుట్టూ తిరిగిన వారిలో జోష్ రవి ఒకరు. ఈయన అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని అయితే ఇలా ఆఫీసుల చుట్టూ తిరిగిన ఇప్పటికీ తనకు ఏ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదని వెల్లడించారు.

దర్శక నిర్మాతలతో పరిచయం ఉండటం లేదా తెలిసిన వారి వల్ల నాకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయని జోష్ రవి తెలిపారు. ఇకపోతే రచయితగా తన కొద్దిగా అనుభవం ఉందని, ఈ క్రమంలోనే ఖలేజా సినిమా సమయంలో తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కొన్ని డైలాగులు రాసి వినిపించారు. ఇక తన డైలాగ్ లు చూసి త్రివిక్రమ్ తనని భుజంతట్టి మెచ్చుకున్నారని తెలిపారు.

ఇక ఖలేజా సినిమా షూటింగ్ సమయంలో తనకు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేదు ఈ క్రమంలోనే అందరూ భోజనం చేస్తున్న సమయంలో ప్రొడక్షన్ బాయ్స్ వచ్చి తింటున్న తనని ఇక్కడ కాదు పక్కకెళ్లు అంటూ అవమానించారని ఈ సందర్భంగా జోష్ రవి తెలిపారు. ఇలా ఇండస్ట్రీలో ఇలాంటి అవమానాలను చాలామంది ఎదుర్కొంటారని ఆయన చెప్పుకొచ్చారు.
చెత్త బుట్టలో వేశారు…
అదేవిధంగా కెరియర్ మొదట్లో అవకాశాలు కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను నా కళ్ళ ముందే నా ఫోటోలు తీసుకొని చెత్త బుట్టలో వేశారని జోష్ రవి ఈ సందర్భంగా కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న అవమానాలును వెల్లడించారు. మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని వెల్లడించారు.ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



























