ప్రస్తుత కాలంలో తాము ప్రేమించిన అమ్మాయిలు కాదు అనడంతో వారిపై హత్యలు, బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పటికీ అలా ఎంతోమంది అమ్మాయిలు ఎంతోమంది ప్రేమోన్మాది చేతిలో బలవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే తన పెళ్లి ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందని ఆ అమ్మాయిను గంజాయి కేసులో ఇరికించాడు ఓ వ్యక్తి. ఇంతకీ అసలు కథ ఏంటో.. ఏం జరిగిందో తెలుసుకుందాం..

వీవర్స్ విల్లా అనే హ్యాండ్లూమ్ కంపెనీ స్థాపకురాలు శోభా విశ్వనాథన్. ఈమె వలయాలకు చెందిన అమ్మాయి. ఇక ఈమెను తన మాజీ స్నేహితుడు పెళ్లి చేసుకోమని వెంట పడగా ఆమె దానికి తిరస్కరించింది. దీంతో అతడు ఆమెపై కోపంతో ఆమె ఆఫీస్ లో గంజాయి ఉందని పోలీసులకు ఒకరి ద్వారా ఫోన్ చేసి చెప్పించేలా చేశాడు. ఇక వెంటనే పోలీసులు విచారించగా గంజాయి దొరకడంతో శోభ విశ్వనాథన్ ను అరెస్టు చేశారు.
దాదాపు 850 గ్రాముల గంజాయి దొరకడంతో శోభ కూడా ఆశ్చర్యపోయింది. ఇక తన తెలివితో ముఖ్యమంత్రికి జరిగిన విషయాన్ని తెలిపింది. తనను ఎవరో కావాలనే ఇలా చేశారని చెప్పడంతో వెంటనే ఆ ముఖ్యమంత్రి స్పందించాడు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా తన మాజీ ఫ్రెండ్ హరీష్ ఇదంతా చేశాడని.. తానే స్వయంగా గంజాయ్ కొని తనపై నింద మోపించడని తెలిసింది.
ఇక అతడు అదే ఆఫీసులో పని చేస్తున్న ఉష అనే అమ్మాయికు డబ్బు ఆశ చూపించి గంజాయిని పెట్టించాడని తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేశారు. ఇక అతడు పైకి మంచివాడిగా నటిస్తూ.. లోలోపల ఎంతో పగ ఉండే వ్యక్తి గా ఉన్నాడని.. అందుకే ఇటువంటి వాళ్ళ నుండి దూరంగా ఉండాలని పోలీసులు తెలుపుతున్నారు. శోభా విశ్వనాథన్ నిర్దోషి అని బయటపడగా తన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చారు.































