సాధారణంగా రైలు కూత వినగానే ప్రతి ఒక్కరు చెవులు మూసుకోవడం సర్వసాధారణమే. సాధారణంగా రైలు కూత పెడుతుంది అంటే ఇష్టానుసారంగా పట్టాలపై వెళ్లే వారికి రైలు వస్తుందని సూచించడం కోసమే రైలు కూత పెడుతుందని మనం భావిస్తాము. అయితే ఇది ఒక కారణమే అయినప్పటికీ రైలు కూత ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా పెడుతుంది.కొన్ని సార్లు చిన్నగా ఉంటే మరికొన్ని సార్లు పెద్ద కూత పెడుతుంది. అయితే రైలు ఈ విధంగా వివిధ రకాలుగా కూత పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో తెలుసుకుందాం..

రైలు ఒక సారి చిన్న కూత పెట్టిందంటే రైలును కడిగి, శుభ్రం చేయడానికి తీసుకువెళ్తున్నారని అర్థం. అదేవిధంగా రెండు సార్లు చిన్న కూత పెట్టిందంటే రైలును నడపడానికి గార్డ్ కి సిగ్నల్ ఇచ్చినట్టు. మూడు సార్లు చిన్న కూత పెట్టిందంటే రైలు ఇంజన్ కంట్రోల్ తప్పి గార్డుకు వాక్యూమ్ బ్రేక్ వేయమని సూచించినట్లు. అదే నాలుగు సార్లు చిన్న కూత పెట్టిందంటే రైలులో సాంకేతిక లోపం తలెత్తి రైలు ముందుకు నడవలేని పరిస్థితిలో ఉందని అర్థం.
రైలు ఒక పెద్ద కూత, ఒక చిన్న కూత పెడితే ఇంజన్ స్టార్ట్ చేయడానికి ముందు బ్రేక్ పైప్‌లైన్ వ్యవస్థను సిద్ధమైందని గార్డుకు చెప్పేందుకు ఒక పెద్ద హార్న్, ఒక చిన్న హార్న్ కొడతారు. అదేవిధంగా ఇంజన్ కంట్రోల్ లోకి తీసుకు రావాలని గార్డుకు చెప్పడం కోసం రెండు పెద్ద కూతలు, రెండు చిన్న కూతలు ఇస్తారు. కొన్నిసార్లు రైలు ఆగకుండా కూత పెడుతుంది. అప్పుడు రైలు స్టేషన్లో ఆగదని అర్థం. రైలు రెండుసార్లు ఆగి ఆగి కూత పెడితే రైలు క్రాసింగ్ మీదుగా వెళ్తుందని అర్థం. రైలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆరు సార్లు చిన్న హార్న్ కొడతారు. ఈ విధంగా రైలు కూతలలో ఎన్నో అర్థాలు ఉన్నాయి.



























