Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో మహేష్ బాబు ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న మహేష్ త్వరలోనే రాజమౌళి డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా ఫాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబుకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు ఒక్కో సినిమాకు సుమారు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకునే మహేష్ బాబు ఒక్క సినిమాకి మాత్రం పైసా కూడా రెమ్యూనరేషన్ లేకుండా సినిమా మొత్తం చేశారని తెలుస్తుంది.
ఇలా మహేష్ బాబు రెమ్యూనరేషన్ లేకుండా నటించిన సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ సినిమా మరి ఏదో కాదు టక్కరి దొంగ డైరెక్టర్ జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఆయనే నిర్మాత అలాగే రచయిత కూడా ఆయనే కావటం విశేషం.ఇది ఒక ప్రయోగాత్మక సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టక్కరి దొంగ..
ఇక ఈ సినిమా మొత్తం విదేశాలలోనే షూటింగ్ జరిగింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ కావడంతో నిర్మాత భారీ స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయారు. అయితే అప్పటికే మహేష్ బాబుకు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదట. ఇదే విషయాన్ని నిర్మాత తనకు గుర్తు చేయడంతో నీకేమైనా పిచ్చి పట్టిందా సినిమా నష్టాల్లో ఉంది తనకు రెమ్యూనరేషన్ అవసరం లేదని మహేష్ బాబు ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట.

































