అఖండ సినిమా నుంచి తాము తప్పుకోవడానికి ప్రధానం కారణం ఏంటంటే… కరోనా ముందు, తర్వాత గురించి చెప్పుకోవాలని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తెలిపారు. చాలా మంది డైరెక్టర్స్ కరోనా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ కరోనా వస్తుందేమో అని భయపడి ముందే సినిమాని అయిపోగొట్టెలా ప్లాన్ చేసుకున్నారని వారు అన్నారు .

చాలా మంది దర్శకులు కూడా కొన్ని సినిమాలకు రిలీజింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారని వారు అన్నారు. మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట ఆయన ఓపెనింగ్, దుబాయిలో షూటింగ్ షెడ్యూల్ పెట్టుకోవడం. వల్ల తమకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందని రామ్ లక్ష్మణ్ వివరించారు.
అప్పటికే అఖండలో రెండు ఫైట్స్ చేశామని, ఇంట్రడక్షన్ టీజర్ తమదే అని వారు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత డేట్స్ కుదరక కంటిన్యూ చేయలేక పోయామని వారు స్పష్టం చేశారు. మా కోసం వెయిట్ చేయండి అని అనేంత సీన్ అక్కడ లేదని, కాబట్టి తప్పుకోవడం బెటర్ అని తాము ఫీల్ అయినట్టు వారు చెప్పారు.
అది ఎందుకంటే బోయపాటి గారి డైరెక్షన్ లో సెకండ్ పార్ట్ ఆల్మోస్ట్ 40 రోజులు యాక్షన్.. అంటే ఫైట్ కి సంబంధిన సీన్స్ ఉన్నాయని, వాటిని కచ్చితంగా చేయాల్సి ఉండేదని వారు అన్నారు. ఒక ఫైట్ చేద్దాం ఊరుకుందాం అనెట్టు అక్కడ సిట్యుయేషన్ లేదని వారు చెప్పారు. దానికి బోయపాటి గారు బాధపడ్డారు కూడా అని రామ్ లక్ష్మణ్ తెలిపారు. మధ్యలో అలా వేరే మాస్టర్ దగ్గరికి వెళ్లడానికి వాళ్ళకు ఇబ్బందిగా అనిపించిందని ఫైట్ మాస్టర్స్ చెప్పుకొచ్చారు.ఇలా తమ వల్ల ఎంతో ఇబ్బందులు అఖండ చిత్ర బృందానికి ఈ సందర్భంగా క్షమాపణ చెబుతున్నట్లు వెల్లడించారు.
































