Serial Actor Satish: సీరియల్ యాక్టర్ సతీష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ తరం వారికి ఈయన సీరియల్స్ లో తండ్రి పాత్రలో కనిపించినప్పటికీ ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన 30 సంవత్సరాల సినీ కెరీర్లో ఏకంగా 140 సీరియల్స్ లో నటించి రికార్డు సృష్టించారు.

ఇలా సీరియల్ యాక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సతీష్ మరొక నటి సీత మధ్య ఏదో రిలేషన్ ఉందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై సతీష్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. మొట్ట మొదటి సారిగా ఈయన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని గతంలో తన గురించి సీత గురించి వచ్చిన వార్తలపై స్పందిస్తూ అన్ని విషయాలను వెల్లడించారు.

తాను సీతతో పరిచయం ఏర్పడకముందే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, తనకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారని సతీష్ వెల్లడించారు. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా తన భార్య భర్త నుంచి విడాకులు తీసుకుని తన పిల్లల్ని కూడా తనతోపాటు తీసుకెళ్లారని సతీష్ వెల్లడించారు. తన పిల్లల్ని చూసి 22 సంవత్సరాలు అవుతుందని విడాకుల తర్వాత పిల్లలు పూర్తిగా తన తల్లి వద్దే పెరుగుతున్నారని సతీష్ తెలియజేశారు.

స్నేహబంధం మాత్రమే..
తన అభిప్రాయం ప్రకారం విడాకులు తీసుకున్న భార్య భర్తల విషయంలో పిల్లలు కొన్ని రోజులు తల్లి వద్ద మరికొన్ని రోజులు తండ్రి దగ్గర ఉంటే వారి కెరీర్ నాశనం అవుతుంది. అందుకే పిల్లలు ఒకరి దగ్గర పెరగడమే మంచిదనే ఉద్దేశంతో నా పిల్లలని తన తల్లి వద్దనే ఉంచానని ఆయన తెలిపారు. ఇక విడాకుల తర్వాత తన గురించి, సీత గారి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆమె తన భర్తకు విడాకులిచ్చి తన దగ్గర ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తనకు నాకు మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహబంధం మాత్రమేనని, అసలు ఇటువంటి వార్తలు ఎవరు సృష్టిస్తారో వారికి అసలు పనేమీ ఉండదని వాటి గురించి పెద్దగా పట్టించుకోమని తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ సీత గారితో తనకి ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చారు.































