ఉత్తర కొరియా ఈ పేరు వింటేనే చాలామందికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇంతకీ అంత భయంకరమైన వాతావరణం ఆ దేశంలో ఏముందని భావిస్తున్నారా. భయంకరమైన వాతావరణం కాదు భయంకరమైన అధ్యక్షుడు ఉండటమే ఉత్తరకొరియా చేసుకున్న పాపం. ఉత్తర కొరియా మన భూమి పైనే ఉన్న ఈ ప్రపంచంతో ఆ దేశానికి సంబంధం ఉండదు. ఆ దేశంలో నివసించే ప్రజలు కేవలం ఉత్తర కొరియాకు సంబంధించిన విషయాలను మాత్రమే తెలుసుకోవాలి వారి అధ్యక్షుడిని మాత్రమే దైవ సమానంగా భావించాలి.ఉత్తర కొరియా లో నివసించే ప్రజల పై జరిగే అరాచకాలు గురించి తెలుసుకుంటే అసలు అక్కడ మనుషులు నివసిస్తున్నారా.. అనే సందేహం కలగక మానదు.

అరాచకానికి నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను అక్కడి ప్రజలు దైవ సమానంగా భావిస్తారు. కాదు… కాదు.. సమానంగా భావించినట్లు నటిస్తారు. కానీ వారి మనసు లోపల మాత్రం అతడిని ఒక రాక్షసుడుగా భావిస్తారు. అయితే ఈ విషయాన్ని బయట పెడితే వారికి మరొక రోజు అంటూ ఉండదు. అతను పెట్టే నిబంధనలు, అతని నిరంకుశ పాలనకు అద్దం పడతాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడికి ఎంతో ముఖ్యమైన రోజులలో ఆ దేశంలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు, లేదా మరే ఇతర కార్యాలు జరుపుకున్న వారికి అదే చివరి రోజు. ఇంతకీ ఆ ముఖ్యమైన రోజులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రతి ఏడాది జూలై 8 డిసెంబర్ 17న ఉత్తర కొరియా ఎవరూ కూడా వారి పుట్టినరోజు వేడుకలు లేదా పెళ్లి రోజులు ఇతర శుభ కార్యాలను కూడా పొరపాటున కూడా జరపకూడదు. అదే విధంగా ఆ రెండు రోజులు ఎవరు పెద్దగా నవ్వకూడదు, మాట్లాడకూడదు. పాటలు వినకూడదు మద్యం సేవించకూడదు. పొరపాటున ఎవరైనా ఇలాంటి కార్యకలపాలకు పాల్పడినట్లు తెలిస్తే వారికి మరణ శిక్ష తప్పదు.
జులై 8, డిసెంబరు 17న అక్కడ సంతాప దినాలు. కిమ్ 2 సంగ్, కిమ్ జంగ్ 2లు ఆ తేదీల్లోనే చనిపోయారు. అందుకే, ఆ రోజు అక్కడ ఎవరు సంతోషంగా గడపకూడదు.దేశంలో పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రే బోధిస్తారు. అందుకోసమే ఈ రెండు రోజులలో ఉత్తర కొరియా లో ఎవరు కూడా వేడుకలు జరుపుకోరు.




























