Naveen: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన నరేష్ ఇటీవల పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈయన విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న నరేష్ ఏకంగా వ్యక్తిగత జీవితంలో మాత్రం నాలుగు పెళ్లిళ్లు చేసుకుని సంచలనంగా మారారు. ఇప్పటికే ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన ఈయన ఇటీవల కాలంలో సినీనటి పవిత్ర లోకేష్ రిలేషన్ లో ఉన్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేయలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజెన్స్ వీరి పెళ్లిళ్ల గురించి ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ పెద్ద కుమారుడు నవీన్ విజయ్ కృష్ణకు తన తండ్రి పెళ్లిళ్ల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. తండ్రికేమో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు మీరు ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు అంటూ ఎన్నో విమర్శలు వస్తున్నాయి విమర్శలపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికర సమాధానాలు చెప్పారు. నాన్న పెద్ద కుటుంబం నుంచి వచ్చారు అందుకే ఆయన పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా ఉన్నారు పిల్లల గురించి పట్టించుకోవడంలేదని చాలామంది విమర్శిస్తున్నారు అయితే నేను ఇలాంటి వాటి గురించి పట్టించుకోనని తెలిపారు.
విమర్శలు పట్టించుకోను…
నాన్న ఆస్తులు ఆయన పెళ్లిళ్లు గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆయన పడిన ఇబ్బందుల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఈ విమర్శించిన వారెవరు వచ్చే ఆదుకోలేదు. నేను ఇలాంటి విషయాలపై అసలు ఫోకస్ పెట్టి నా టైం వేస్ట్ చేయాలని అనుకోలేదు. ఇక మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగగా సరైన సమయం రాలేదు అందుకే పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని విడిపోవడం కంటే సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం మంచిది. నా లైఫ్ లోకి ఎవరైనా ఒక అమ్మాయి వస్తే పర్లేదు రాకపోయినా ఇలాగే ఉండిపోతాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


























