Niharika Konidela: నిహారిక కొణిదెల గత కొన్ని నెలల నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఈమె ఒక మనసు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతగా వెబ్ సిరీస్ నిర్మిస్తూ నిర్మాతగా గుర్తింపు పొందారు.

ఇలా ఒక వైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు అవ్వడమే కాకుండా దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురయ్యేది. ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేశారు.ఈ విధంగా ఇంస్టాగ్రామ్ ఖాతా డిలీట్ చేయడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈమె గురించి ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి.

ఇక ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసిన కొద్ది రోజులకే నిహారిక పబ్ లో పోలీసులకు దొరకడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఈ విధంగా పబ్ వ్యవహారం తర్వాత పూర్తిగా సోషల్ మీడియాకు దూరమైన నిహారిక ఒక్కసారిగా ఇంస్టాగ్రామ్ ద్వారా తిరిగి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.
వెల్ కమ్ బ్యాక్ నిహారిక…
ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ ద్వారా నిహారిక చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు, ఇతరులు ఏం చేస్తున్నారనే విషయం గురించి నేను పట్టించుకోను,ప్రస్తుతం తాను ఎంతో రీఫ్రెష్ అయ్యానని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ ద్వారా చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది.ఇలా నిహారిక తిరిగి ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టడంతో ఎంతోమంది అభిమానులు ఆమెకు తిరిగి ఇంస్టాగ్రామ్ కు స్వాగతం పలికారు.



























