మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు మళ్లీ బెదిరింపు ఈ మెయిళ్లు వచ్చాయి. ఇప్పుటి వరకు మూడు సార్లు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ నుండి ఈ మెయిల్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై గౌతం గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో గంభీర్ కు వచ్చిన మెయిల్ లో నిన్ను చంపాలనుకున్నాం. నిన్న బతికిపోయావ్. బతుకుమీద ఆశ ఉంటే రాజకీయాలను, కశ్మీర్ అంశాన్ని వదిలెయ్ అని మెయిల్‌లో బెదిరించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు గౌతం గంబీర్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. గంభీర్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు.
గంభీర్ ఇంటి వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక దీనిపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ మెయిల్ గురించి గూగుల్ ను పూర్తి వివరాలు ఇవ్వాలని సమాచారం కోరారు ఢిల్లీ పోలీసులు. గూగుల్ ఇచ్చిన సమాచారం ప్రకారంగా పాకిస్తాన్ నుండి వచ్చినట్టుగా ఉందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.
అంతే కాకుండా ఈ దర్యాప్తులో భాగంగా సైబర్ సెక్యూరిటీ సెల్ సహాయాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. ఢిల్లీ పోలీస్‌లోని ఉగ్రవాద సంస్థ గూఢచారులు మాజీ క్రికెటర్ పై నిఘా ఉంచారని బెదిరింపులో పేర్కొన్నారు. గతంలో బెదిరింపు ఈమెయిళ్లు పాకిస్థాన్ కరాచీ సింధ్ యూనివర్సీటీ నుంచి షాహీద్ హమీద్ అనే యువకుడు పంపించారని నిర్థారించారు.



























