భారతదేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏదో ఒక ప్రదేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి నుంచి మహిళ బయటకు వెళ్లింది మొదలు.. జాగ్రత్తగా ఇంటికి వస్తుందన్న నమ్మకం లేకుండాపోయింది.

దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవతున్నారు. ఇంటువంటి ఘటన ఒకటి హైదరాబాద్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇల్లు ఇప్పిస్తానని చెప్పి.. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాలెనగర్ కు చెందిన 28 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె గదిలో నివాసం ఉంటుంది.
ఆమె తన కుటుంబపోషణ కొరకు ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఆమెకు రఫీక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడు ఆమె ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఓ రోజు ఆమెకు ఇల్లు కావాలని కోరడంతో.. అతడు ఆమెను తన కారులో షాహిన్ నగర్ లో ఇల్లు ఇప్పిస్తానని తీసుకెళ్లాడు. కానీ ఆమెను షాహిన్ నగర్ కు తీసుకెళ్లకుండా.. పాతనగరం తీసుకెళ్లాడు.
అక్కడ ఆమెను ఆ రూంలో బంధించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తున్న సమయంలో తన ఫోన్ కెమెరాతో వీడియోలు, ఫొటోలు తీశాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. ఈ విషయంపై ఎవరికైనా చెబితే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. కానీ ఆమె ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినా కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన బయటకు తెలవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.



























