ప్రస్తుతం మన జీవన శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే అధిక ఒత్తిడి ఆందోళనకు గురవుటం వల్ల ఎక్కువమంది అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. ఈ విధంగా రక్త పోటు సమస్య తో బాధపడే వారు నిత్యం వారి బ్లడ్ ప్రెజర్ ను అంచనా వేసుకుంటూ ఉండాలి. మన శరీరంలో బ్లడ్ ప్రెజర్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఈ విధంగా మన శరీరంలో బ్లడ్ ప్రెజర్ పెరగడానికి తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి.

ఈ క్రమంలోనే మనం తరచూ మన శరీరంలో బ్లడ్ ప్రెజర్ ఎలా ఉంది అనే విషయాలను రీడింగ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా బీపీ చెక్ చేసుకోవడానికి ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పనులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
మన ఇంట్లోనే బ్లడ్ ప్రెజర్ ను రీడింగ్ చేసే సమయానికి అరగంట ముందు మనం ఏ విధమైనటువంటి ధూమపానం మద్యపానం కానీ సేవించరాదు. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేసిన వెంటనే కూడా బ్లడ్ ప్రెజర్ రీడింగ్ చేయకూడదు. బ్లడ్ ప్రెజర్ రీడింగ్ చేస్తున్న సమయంలో మన మూత్రశయం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. నిటారుగా కూర్చుని రెండు కాళ్లు నేలకు సమాంతరంగా పెట్టుకొని కూర్చోవాలి. బ్లడ్ ప్రెజర్ రీడింగ్ చేసుకునే సమయంలో పొరపాటున కూడా కాళీ పై కాలు వేసుకొని కూర్చోకూడదు.
బ్లడ్ ప్రెజర్ రీడింగ్ చేసేటప్పుడు మన చేతులు భుజాలకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా రీడింగ్ తీసేటప్పుడు ఒక నిమిషం వ్యవధిలో రెండు మూడు రీడింగులను తీసుకోవాలి. సాధారణంగా బ్లడ్ ప్రెజర్ రీడింగ్ అనేది మన గుండె సంకోచ వ్యాకోచాలా ఆధారంగా తీసుకుంటారు. సాధారణంగా ప్రతి మనిషికి 120/80 ఎంఎం హెచ్‌జీ ఉంటే అది సాధారణ బ్లడ్ ప్రెజర్ గా పరిగణిస్తారు.బీపీ సాధారణ స్థితిలో ఉండాలంటే తప్పనిసరిగా మనం తీసుకునే ఆహార విషయాలలో తగినన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.


































