నటిగా ,రాజకీయ అభ్యర్థిగా ఎంతో చురుగ్గా ఉండే రోజా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సంగతి మనకు తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం ఆమె రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న క్రమంలో ఆమె ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.రాజకీయాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం ఇంట్లో ఉన్నప్పటికీ తన అధికారిక కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు.

తన నియోజకవర్గంలో సమస్యలు, కరోనా కట్టడి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పది రోజుల నుంచి ఆన్ లైన్ ద్వారా అధికారులతో ఆమె టచ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ముఖ్యపట్టణమైన పుత్తూరు మునిసిపాలిటీ అధికారులు, నేతలతో రోజా జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరోనా కట్టడి చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులతో మాట్లాడారు.
కరోనాతో బాధపడుతున్నవారు ఆసుపత్రిలో చేరకుండా హోమియోపతి, అల్లోపతి వంటి మందులను వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగరి నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. ముఖ్యంగా ఈ దశ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న క్రమంలో యువత కూడా మరణిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్న సమయంలో రోడ్లపై విచక్షణారహితంగా ప్రవర్తించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ఈ విధంగా రోజా సర్జరీ తర్వాత ఇంటికే పరిమితమైన తన విధులను ఎంతో చక్కగా నిర్వహించడంతో ఈమె ఎక్కడున్నా ఫైర్ బ్రాండ్ అని మరోసారి నిరూపించుకున్నారు.































