Tolly wood Hero: సాధారణంగా ప్రతి ఒక్కరంగంలోనూ రాజకీయాలు జరుగుతాయని విషయం మనకు తెలిసిందే.ఏ రంగంలోనైనా వారి వారసులే కొనసాగాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఇలాంటి రాజకీయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.కొత్త వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఇండస్ట్రీలో తొక్కేయాలని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎదురయ్యే బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గిన వారు కొందరు ఉండగా మరికొందరు అలాంటి ఆటంకాలను ఎదుర్కొని తమని తాము నిరూపించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి బెదిరింపులు గురించి యంగ్ హీరో అరుణ్ ఆదిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్ హీరో అరుణ్ అదిత్ మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన చిత్రం ప్రేమదేశం.
ఈ సినిమా నవంబర్ 18వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా హీరో అరుణ్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మొదట విజయవాడకు చెందిన ఓ నిర్మాత తనకు అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయాలని కోరారు. అయితే వారం రోజులు సినిమా షూటింగ్ జరిగిన తర్వాత ఆయన వచ్చి సినిమా చేయడం లేదని డబ్బు వెనక్కి తీసుకెళ్లారు.
ఇలా ఎందుకు జరిగింది అని తన ఆరా తీయడం మొదలుపెట్టగా కొందరు తనని సినిమా విడుదల కాకుండా ఆపేస్తామని, డిజిటల్ హక్కులు కూడా దొరకవు సినిమాలో కొత్త వాళ్ళు ఎలా వస్తారు అంటూ తనని బెదిరించారని అర్థమైంది. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరికి భయపడకుండా ఈ సినిమాని నలుగురు ప్రొడ్యూసర్లు కలిసి నిర్మించారు.

Tolly wood Hero: ఇండస్ట్రీలో తొక్కేయాలని చూశారు…
సాధారణంగా ప్రతి ఒక్క రంగంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. అయితే మనం వేటికి భయపడకుండా ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్తేనే మనం అనుకున్న విజయాలను సాధిస్తామని హీరో అరుణ్ అదిత్ సినిమా ఇండస్ట్రీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ సిద్ధం అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు ఇక ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందిం

































