Tollywood Directors: ఒక సినిమా సక్సెస్ కావాలి అంటే ఆ సినిమా విషయంలో దర్శకుడిది కీలకపాత్ర అని చెప్పాలి.ఇలా దర్శకుడు సినిమా విషయంలో అన్ని తానే వ్యవహరిస్తూ సినిమాని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇలా సినిమాను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించే డైరెక్టర్లకు ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తారు అనే విషయానికి వస్తే..ఈ ఏడాదిలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి టాప్ 10 డైరెక్టర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

సురేందర్ రెడ్డి: ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి సురేందర్ రెడ్డి తాజాగా అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక సురేందర్ రెడ్డి ఒక్కో సినిమాకు ఐదు నుంచి పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
సందీప్ రెడ్డి వంగ: అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ బిజీ డైరెక్టర్ గా మారిపోయారు.
పరశురామ్: గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి పరశురామ్ తాజాగా సర్కారు వారి పాట సినీమాతో హిట్టు కొట్టారు. ఈయన కూడా ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
బోయపాటి శ్రీను: యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి తాజాగా బాలకృష్ణతో అఖండ సినిమా ద్వారా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఈయన రామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక బోయపాటి ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
అనిల్ రావిపూడి: పటాస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అనిల్ రావిపూడి ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
వంశీ పైడిపల్లి: తాజాగా వారసుడు సినిమాతో హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి ఒక్కో సినిమాకు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
కొరటాల శివ: అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కొరటాల ఆచార్య సినిమాతో డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు పొందారు. ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. ఈయన ఒక్కో సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

Tollywood Directors:
త్రివిక్రమ్ శ్రీనివాస్: మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 35 నుంచి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
సుకుమార్: పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ ఇండస్ట్రీలో బిజీ డైరెక్టర్గా మారిపోయారు. ఈయన ఒక్కో సినిమాకు 40-50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అని టాక్. ఇక ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.
రాజమౌళి: తెలుగు సినిమా సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసినటువంటి లెజెండరీ డైరెక్టర్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇప్పటివరకు ఇండస్ట్రీలో అపజయం మెరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నటువంటి రాజమౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం.































