Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఈయన తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో లగ్జరీ లైఫ్ గడపడానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే ఎంతో ఖరీదైన కార్లు,బంగ్లాలు కొనుగోలు చేసి తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన కొత్త ఇంటి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నారని తెలుస్తుంది.హైదరాబాద్ లోనే అల్లు అర్జున్ ఏకంగా రెండు ఎకరాలలో వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నారు.

రెండు ఎకరాలలో 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 కోట్ల రూపాయలతో ఇంటి నిర్మించారు. సహజసిద్ధమైన తెలుపు రంగుతో ఉన్న ఇంటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, జిమ్ సెంటర్, పిల్లలకు ప్లేగ్రౌండ్ ఏరియా, హోమ్ థియేటర్, ఏదైనా పార్టీలు జరిగితే ప్రత్యేకంగా పార్టీ చేసుకోవడం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు.

ఖరీదైన లగ్జరీ కార్లు…
కేవలం ఖరీదైన బంగ్లా మాత్రమే కాకుండా ఆయన దగ్గర ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి.ఇక అల్లు అర్జున్ గతంలో ఫాల్కాన్ వ్యానిటీ ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. అదేవిధంగా కోట్ల విలువ చేసే హమ్మర్ హెచ్-2 కారు తన దగ్గర ఉంది. అదేవిధంగా తన గ్యారేజ్ లో రెడ్ మెర్సిడేజ్ 200 సీడీఐ ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. ఇక అల్లు అర్జున్ నూతనంగా నిర్మించిన తన ఇంటికి ‘బ్లెస్సింగ్’. అని పేరు పెట్టుకున్నారు. ఇలా ఐకాన్ స్టార్ట్ నిజజీవితంలో కూడా ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని చెప్పవచ్చు.

































