విడాకుల తర్వాత అక్కినేని కాంపౌండ్ లో అడుగు పెట్టిన సమంత.. కారణం అదే!

0
54

ఇటీవలే టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్న తరువాత వీరిద్దరి పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపించాయి. తప్పు అంతా సమంతదే అన్నట్లు నెటిజన్లు ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు. విడాకుల తర్వాత సమంత ఆ విషయాన్ని మరిచిపోవడానికి సినిమాలలో బిజీ బిజీ అవడానికి ప్రయత్నిస్తోంది.

నాగచైతన్య కూడా ఆ విషయాన్ని మరిచిపోయి కెరిర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం సమంతకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విడాకులు తరువాత మొదటిసారిగా అక్కినేని నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సమంత ప్రత్యక్షమైందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సమంత ఆ స్టూడియోకి రావడానికి అసలు కారణం శాకుంతలం డబ్బింగ్ కోసం స్టూడియోలో ప్రత్యక్షమైనట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ మొత్తానికి సమంత విడాకులు తరువాత మొదటిసారిగా అన్నపూర్ణ స్టూడియోస్ లోకి రావడంపై ఈ విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు వినిపిస్తున్నాయి. ఇక సమంత విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతువాక్కుల రెండు కాదల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో నయనతార విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here