తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సినీ గేయరచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. అదే విధంగా ఒక అద్భుతమైన గాయకుడిగా ఎస్పీ బాలు ప్రస్థానం ఏంటో అందరికీ తెలిసిందే. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఎన్నో అద్భుతమైన పాటలను బాలసుబ్రమణ్యం తన మధురమైన గానంతో ఆలపించి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు.

ఇదిలా ఉండగా ఈ ఏడాది వ్యవధిలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ లెజెండ్స్ ను కోల్పోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గత ఏడాది 2020 సెప్టెంబర్ 5వ తేదీ కరోనా మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కన్నుమూశారు. ఆయన మరణవార్త విన్న ఎంతోమంది తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరణించిన ఏడాదిలోగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం ఏర్పడింది. ఇలా సీతారామ శాస్త్రి కలం నుంచి విధాత తలపున…, అనాది జీవన వేదం ,గాలి, ఈ నీరు, ఈ ఊరు, సెలయేరు, ననుగన్న నా వాళ్ళు..పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు, రంగరిస్థివో, ఇలా బొమ్మ చేస్తివో అంటూ ఎన్నో అద్భుతమైన పాటలను అందించడం సిరివెన్నెల ఇకలేరు అనే విషయం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రస్తుతం ఈయన పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్ లో పలువురు అభిమానుల సందర్శనార్థం ఉంచారు.ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. త్వరలోనే ఈయన అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.































