మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈయన రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. ఎంతోమందికి అండగా నిలిచే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా అలాంటి విపత్కర సమయాల్లో ఎంతోమందిని ఆదుకొని వారికి ఆక్సిజన్ సిలిండర్ లను సప్లై చేసిన గొప్ప వ్యక్తి చిరంజీవి. చిరు కేవలం ఒక నటుడిగానే కాకుండా మానవత వాదిగా గొప్ప పేరును కూడా సంపాదించుకున్నారు.

ఇప్పటికే ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎంతో మందికి సేవలను అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసున్న చాటుకున్న చిరంజీవి మరొకసారి ఒక వ్యక్తికి సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమానికి అండగా నిలిచారు. ఆ క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తి వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
విశాఖ జిల్లాకు చెందిన వెంకట్ అనే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి మెగాస్టార్ కు వీరాభిమాని. చిరంజీవి పేరున పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా అభిమానులు చాటుకుంటూ ఉంటారు. అయితే అతను గత కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మెగాస్టార్ వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకురావాలని తెలిపారు.
అంతేకాకుండా అతడి వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చులు అన్నీ కూడా తానే భరిస్తానని మెగాస్టార్ హామీ ఇచ్చాడు. దీనితో వెంకట్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చిరంజీవి తన అభిమానులు కష్టాల్లో ఉన్న సందర్భాల్లో ఆదుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నాడు.































